వైరల్‌: పె..ద్ద.. ఐస్‌గోళా ఖరీదెంతో తెలుసా?

Viral Video: Gujarat Vendor Makes Giant Ice Gola Weighing 5 KG - Sakshi

వాన పడితే చాలు వేడి వేడీ బజ్జీలు, పకోడీలు గుర్తుకొస్తాయి. ఇక ఎండాకాలంలో అయితే చల్లని పానియాలు, ఐస్‌క్రీమ్‌లు.. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతాం. అలాగే ఇతర సీజన్లలో కూడా.. రొటీన్‌కి భిన్నంగా కొత్త రుచుల కోసం ఎప్పుడూ వెదుకుతూనే ఉంటాం! ఋతువుకో రుచన్నమాట. సాధారణంగా వేసవికాలంలో ఏ వీధిలోనైనా ఐస్‌గోళా బండి కనిపిస్తుంది.

నలగ్గొట్టిన ఐస్‌ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్‌లో, రకరకాల రంగుల్లో భిన్న రుచుల్లో అందిస్తారు. వీటిని పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా ఆస్వాదిస్తారు. ఐస్‌గోళా పాపులర్‌ రుచుల్లో కలఖట్టా ఫ్లేవర్‌ ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎందరో. ఐతే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఒక స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి 5 కేజీల అతిపెద్ద ఐస్‌గోళాను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ భారీ ఐస్‌గోళాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వేలకొద్ది నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 

ప్రముఖ ఫుడ్‌ బ్లాగర్‌ అమర్‌ సిరోహి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియోలో దీని తయారీ విధానాన్ని మనం చూడొచ్చు. మూడున్నర కేజీల నలగ్గొట్టిన ఐస్‌ను కోలాకారంలో తయారు చేసిన తర్వాత దీనిపై మ్యాంగో , చాక్లెట్‌లతో పాటు భిన్న రుచుల చిక్కని ద్రావణాలను పోశారు. దీని పై భాగంలో కేసర్‌ రబ్రీ, తాజా క్రీమ్‌లను జోడించారు. వీటన్నింటినీ చేర్చడంతో మరికొంచెం పెద్దగా తయారైంది. తర్వాత కోవాను తురిమి, నాలుగు స్పూన్ల ఐస్‌క్రీమ్‌ను పై భాగంలో ఉంచారు. వీటిపై క్రీమ్‌తో మరొక​ పొరను వేశారు. చివరిగా చెర్రీస్‌, చాక్లెట్‌ చిప్స్‌, బాదం పప్పు, సిరప్‌లతో అలంకరించారు. నోరూరించేలా ఉన్న ఈ ఐస్‌గోళా దేశంలోనే అతిపెద్దదని, 12 మంది తినగల ఈ గోళా ఖరీదు రూ.999లని అమర్‌ సిరోహి చెప్పుకోచ్చాడు.

చదవండి: ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్‌.. ఎలా వండాలంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top