ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్‌.. ఎలా వండాలంటే..

Bengali Prawn Recipe In Telugu Know How To Make It - Sakshi

మన దగ్గర చాలా మంది క్యాబేజీ తినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. కానీ ఇతర దేశాల్లో ప్రతి సలాడ్‌లోనూ క్యాబేజీ ఉండాల్సిందే. దీనిలో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. నారింజ పండులోకంటే క్యాబేజీలోనే విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. పీచుకూడా ఎక్కువే. ఇవేగాక సల్ఫర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, విటమిన్‌ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది మంచి ఆహారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
రొయ్యలు – పావు కేజీ, ఆవ నూనె – నాలుగు టేబుల్‌ స్పూన్లు, బంగాళ దుంప – ఒకటి (ముక్కలుగా తరగాలి), బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను, పసుపు – టీస్పూను, కారం – రుచికి సరిపడా, టొమాటో – ఒకటి( సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, పంచదార – అర టీస్పూను, క్యాబేజీ తరుగు – నాలుగు కప్పులు ( ఉప్పునీళ్లల్లో అరగంటపాటు నానబెట్టుకోవాలి), గరం మసాలా పొడి – అరటీస్పూను. 

తయారీ విధారం:

►ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్ప వేసి కలిపి పదినిమిషాలపాటు నానబెట్టాలి. 

►స్టవ్‌ మీద బాణలి పెట్టి అవనూనె వేసి వేడెక్కిన తరువాత నానబెట్టిన రొయ్యలు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. 

►బంగాళ దుంప ముక్కలు వేసి గోల్డ్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించి  పక్కన పెట్టుకోవాలి. 

►ఇదే పాన్‌లో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 

►ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు పోసి పచి్చవాసన పోయేంత వరకు వేయించాలి. 

►ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో తరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. 

►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు, రొయ్యలు, నానబెట్టిన క్యాబేజీ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఆయిల్‌ పైకి తేలేంత వరకు ఉడికించి, తరువాత గరం మసాలా పొడి చల్లితే బెంగాలీ రొయ్యల ఇగురు రెడీ.

క్యాబేజీ చికెన్‌ ఎలా వండాలో తెలుసా!


కావల్సిన పదార్థాలు:
చికెన్‌ బ్రెస్ట్‌ ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తురుముకోవాలి), ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు, క్యాబేజీ తరుగు – ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్‌ – ఒకటి( ముక్కలు చేయాలి), కొబ్బరి సాస్‌ – పావు కప్పు, తరిగిన అల్లం – అర టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – రెండు టీస్పూన్లు, స్రింగ్‌ ఆనియన్‌ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానం: 
►ముందుగా స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 
►తరువాత చికెన్‌ ముక్కలు వేసి గోల్డ్‌ కలర్‌లోకి వచ్చేంతవరకు వేయించాలి. 
►చికెన్‌ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్‌ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్‌ రెడీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top