సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!

Viral Video Dog Attacked The Lion Leaving Everyone Stunned - Sakshi

సింహాన్ని చూస్తే ఎవరికైనా హడల్‌ పుట్టాల్సిందే! కానీ దీని దెబ్బకి సింహమే బెదిరి సైడిచ్చుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోవైపు మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

ఈ వీడియోలో ఓ కుక్క అరుస్తూ సింహం వెంట పడటం కనిపిస్తుంది. అంతేకాకుండా సింహంపై దాడి చేస్తుంది కూడా. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ.. సింహం మాత్రం సదరు కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్యర్యంతో తలమునకలైపోతున్నారు. ఇది నిజమేనా.. అసలేం జరుగుతుందని సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ అధికారి అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్‌ చేస్తుంటాడు. అతని ఫాలోవర్లు ఈ వీడియోలను అమితంగా ఇష్టపడటమేకాకుండా ఇతర సోషల్‌ మీడియాల్లో షేర్‌ కూడా చేస్తారట.

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top