విఘ్నేశ్వ‌రుని పూజ త‌రువాత వాయ‌న‌దానం మంత్రం

Vayanadanam Mantram After Ganesh Pooja - Sakshi

శో‘‘    గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ 
        గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః
     (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను)
 
మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం
పూషోహస్తాభ్యామా దదా!
(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)

ఉద్వాసన మంత్రము: 
(ఈ కింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‌‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్‌ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్‌.

(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top