చిన్నారుల్లో యూటీఐ నివారణ ఇలా... | urinary tract infection home remedies | Sakshi
Sakshi News home page

Urinary Tract Infection: చిన్నారుల్లో యూటీఐ నివారణ ఇలా...

Feb 20 2022 10:22 AM | Updated on Feb 20 2022 11:26 AM

urinary tract infection home remedies - Sakshi

చిన్నపిల్లలు చాలామంది మూత్రవిసర్జన సమయంలో మంట అని ఏడుస్తుంటారు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఇలా జరుగుతుంది. వేసవిలో పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ఈ కింది జాగ్రత్తలతో దాన్ని నివారించవచ్చు. 
పిల్లలు తగినంతగా నీళ్లు తాగేలా జాగ్రత్త తీసుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఆటల్లో పడి పిల్లలు నీళ్లు తాగరు. దాంతో ఈ సమస్య ముప్పు పెరుగుతుంది. 

వదులుగా ఉండే దుస్తులు వేయాలి. ముఖ్యంగా నడుము కింది భాగంలో బిగుతుగా లేకుండా చూసుకోవాలి. 

వారి ప్రైవేటు అవయవాల ప్రాంతాన్నంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం నేర్పించాలి. ఇన్ఫెక్షన్‌ ఉన్న సమయంలో మూత్రవిసర్జన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ఆ ప్రాంతమంతా శుభ్రం చేయాలి. ఇందుకు సబ్బు నీళ్లు వాడకూడదు. ప్లెయిన్‌ వాటరే మంచిది. 

పిల్లలకు మంచి టాయిలెట్‌ అలవాట్లు నేర్పాలి. అంటే మూత్రమంతా బయటకు వచ్చేలా మూత్రవిసర్జన చేయడం, ప్రైవేట్‌ పార్ట్స్‌ శుభ్రంగా కడుక్కోవడం వంటివి). 

యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు చేయకూడని పనులనూ గుర్తుపెట్టుకోవాలి. నీళ్ల తొట్టిలో సబ్బు కలిపి నురగవచ్చేలా చేసి, తొట్టి స్నానం చేయించడం (బబుల్‌ బాత్‌) వల్ల యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. అందుకే ఆ సమయంలో బబుల్‌బాత్‌ చేయించకూడదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement