అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!

Thief Broke Into Deputy Collectors House And Left Hilarious Note For Him - Sakshi

ఈ దొంగ చాలా డీప్‌గా హర్ట్‌ అయ్యాడండీ.. పాపం!! ఎంతగా నొచ్చుకున్నాడంటే సాటి ఏ దొంగకీ ఈ పరిస్థితి దాపరించకూడదని తిరిగి వెళ్తూ.. తాను వచ్చి వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా వదిలివెళ్లాడు. అసలేం  జరిందంటే.. దొంగన్నాక కన్నం వేయాలి.. కన్నం వేయాలంటే కష్టపడి తాళం పగలగొట్టాలి... విలువైన ధనం, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి.. మూడో కంటికి కనిపించకుండా ఉడాయించాలి! మామూలు కష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దొంగ మాత్రం కొంచెం భిన్నంగా నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్‌ ఇంటిని దోచుకోవడానికి ఎంచుకున్నాడు. 

ఐతే ఎప్పటిలాగానే దొంగగారు ఇంటితాళం పగులగొట్టాడు. లోపలికి ప్రవేశించాడు. ఎంతవెతికినా ఏమీ దొరకలేదు. చిర్రెత్తిపోయిన ఆ దొంగ వెళ్తూ వెళ్తూ ఒక ఉత్తరం ఆ ఇంట్లో రాసి పెట్టి మరీ వెళ్లాడు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందనేగా మీ సందేహం! ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్‌?’ అని ఆ నోట్‌లో రాసి ఉంది.

ఈ హాస్యాస్పదమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా, త్రిలోచన్‌ గౌర్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఇంటి సమీపంలోనే  పోలీసు సూపరింటెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇంత సాహసోపేతమైన పనికి ఒడిగట్టిన దొంగ, అతను రాసిన ఉత్తరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐతే లోకల్‌ అథారిటీస్‌ మాత్రం దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు.

చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top