Sakshi News home page

వేసవిలో తాపం తగ్గేలా సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం ఇలా!

Published Fri, Mar 15 2024 10:41 AM

Tasty Sago Halwa Recipe In Hot Summer - Sakshi

చలికాలం... సగ్గుబియ్యం హల్వా తింటే జలుబు చేస్తోందా! అయితే... ఇదే మంచి సమయం. ఎండల్లో వండుకుందాం. సగ్గుబియ్యం చలవ చేస్తుంది... ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దహీ... కేసర్‌... కోవాతోపాటు పొటాటోతోనూ కలిసిపోతుంది. ఈవెనింగ్‌ స్నాక్‌ అవుతుంది...లంచ్‌లో మెయిన్‌ కోర్స్‌ అవుతుంది. భోజనం తర్వాత డెజర్ట్‌ గానూ సర్దుకుపోతుంది. అలాంటి సగ్గుబియ్యంతో సాబుదానా హల్వా చేద్దామిలా!.

తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగ్గుబియ్యం– కప్పు
చక్కెర – కప్పు
నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్‌లు 
ఫుడ్‌ కలర్‌– చిటికెడు 
ఏలకుల పొడి– అర టీ స్పూన్‌ 
జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు 
కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌
పాల కోవా– 2  టేబుల్‌ స్పూన్‌లు లేదా చిక్కటి పాలు కప్పు; నీరు – 2 కప్పులు. 

తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి నీరు పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించాలి. వేగిన జీడిపప్పు, కిస్‌మిస్‌ను తీసి పక్కన పెట్టి అదే బాణలిలో ఉడికిన సగ్గుబియ్యం, చక్కెర, ఫుడ్‌ కలర్‌ వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు పాల కోవా వేసి కలపాలి. కోవా లేకపోతే పాలు పోసి, ఏలకుల పొడి వేసి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలిపితే సాబుదానా హల్వా రెడీ. 

(చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి! టేస్ట్‌ అదిరిపోతుంది)

Advertisement
Advertisement