Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా! | Tasty Kova Banana Halwa Recipe In Telugu | Sakshi
Sakshi News home page

Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా!

Feb 27 2022 4:08 PM | Updated on Feb 27 2022 5:14 PM

Tasty Kova Banana Halwa Recipe In Telugu - Sakshi

మీకు స్వీట్లంటే ఇష్టమా? హల్వా అంటే మరీ ఇష్టమా? ఎప్పుడూ ఒకేలాంటి హల్వా తిని బోర్‌ కొడితే.. ఈ కోవా బనానా హల్వాను ట్రై చేయండి. ఎంచక్కా లొట్టసేకుంటూ లాగించేయండి.

కోవా బనానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
కోవా – అర కప్పు
అరటిపండ్లు – 3 (తొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌
పంచదార – అర కప్పు
నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు
డ్రైఫ్రూట్స్‌ ముక్కలు – కొన్ని

తయారీ:
►ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి వేడికానివ్వాలి.
►ఇందులో అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి.
►తర్వాత పంచదార వేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి.
►కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►ఆ మిశ్రమాన్ని మొత్తం నెయ్యి పూసిన బౌల్లోకి తీసుకుని చల్లారనిచ్చి, గట్టిపడిన తర్వాత సర్వ్‌ చేసుకోవాలి.
►డ్రైఫ్రూట్స్‌ ముక్కల్ని హల్వా చేస్తున్నప్పుడు లేదా పూర్తి అయిన తర్వాత జోడించుకోవచ్చు. 

చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement