Jackfruit Juice Health Benefits: పనస పండు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఇక జ్యూస్‌ తాగితే!

Summer Drinks: Jackfruit Panasa Juice Recipe Health Benefits - Sakshi

Jackfruit Surprising Health Benefits: పనసలోని యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్, టైప్‌ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. 

పనస తొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.
పనస జ్యూస్‌ తాగినప్పుడు పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు.
ఫలితంగా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
విటమిన్‌ సి, ఈ, లారిక్‌ యాసిడ్‌లలోని యాంటీసెప్టిక్‌ గుణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు. 
కొబ్బరిపాలు, బెల్లంలలో కావల్సినంత ఐరన్‌ ఉంటుంది.
దీని జ్యూస్‌ తాగడంవల్ల హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరగి రక్త హీనత సమస్య ఎదురవదు. 
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపపడుతుంది.
చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ జ్యూస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  

జాక్‌ఫ్రూట్‌ షేక్‌కు కావలసినవి:
గింజలు తీసిన పనస తొనలు – రెండు కప్పులు
చిక్కటి కొబ్బరి పాలు – కప్పున్నర
బెల్లం తరుగు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
నీళ్లు – అరకప్పు, ఐస్‌ క్యూబ్స్‌ – ఎనిమిది.  

తయారీ... 
పనస తొనలను సన్నగా తరిగి బ్లెండర్‌లో వేయాలి 
తొనలకు బెల్లం, కొబ్బరిపాలను జోడించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి 
మెత్తగా నలిగిన తరువాత ఐస్‌ క్యూబ్స్, అర కప్పు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.  
అన్నీ చక్కగా గ్రైండ్‌ అయ్యాక వెంటనే గ్లాసులో పోసుకుని సర్వ్‌ చేసుకోవాలి.  

వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్‌, నేరేడు.. జ్యూస్‌ కలిపి తాగితే.. కలిగే లాభాలివే!
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top