Skin Care Tips: అలొవెరా జ్యూస్‌ తాగితే ఇన్ని ఉపయోగాలా?!

Skin Care Diet Aloe Vera Juice Could Reduce Your Skin Problems In Natural Ways - Sakshi

కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులు, పని ఒత్తిడి కారణమేదైనా.. మీ చర్మం సహజ కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మానికి తీరని నష్టం వాటిల్లుతుంది. వీటితోపాటు మీ ఆహార అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా అందే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉంచేందుకు ఎంతో తోడ్పడతాయి. ఒకవేళ సహజమైన పద్ధతుల్లో మీ చర్మానికి చికిత్స అందించాలంటే అలోవెరా (కలబంద)కు మించిన ఔషధం మరొకటి లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అలొవెరా ఏ విధంగా చర్మకాంతిని మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం..

చర్మానికి కలబంద చేసే మేలు..
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. డల్ స్కిన్, ముడతలకు కారణమయ్యేఫ్రీ రాడికల్స్‌ నివారణకు సహాయపడుతుంది. డీకే పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ‘హీలింగ్‌ ఫుడ్స్‌’బుక్‌ ప్రకారం బేటా కెరోటిన్‌, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరా ఉపయోగంలో ఉంది.

అలొవెరా జ్యూస్‌ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే..
కలబందను జ్యూస్‌ రూపంలో తాగడం చాలా ఉత్తమమైన మార్గం. మీడియం సైజులో ఉండే ఒక అలొవెరా ఆకును తీసుకుని, చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. పై తోలును తొలగించి జెల్‌ను ఒక గిన్నెలో వేసి నీళ్లతో శుభ్రం చేయాలి. దీనిలో పైనాపిల్‌,యాపిల్‌ ముక్కలను వేపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అంతే! కలబంద జ్యూస్‌ రెడీ!! ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్‌ ను ప్రతిరోజూ క్రమం​ తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top