కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి! | Simple And Best Kitchen Tips In Telugu For Gravy In Curry | Sakshi
Sakshi News home page

Kitchen Tips: కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!

Jul 1 2022 9:12 PM | Updated on Jul 1 2022 9:29 PM

Simple And Best Kitchen Tips In Telugu For Gravy In Curry - Sakshi

కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...!

►పెరుగు, ఫ్రెష్‌ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి.
►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది.


►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి.
►నానాక జీడిపప్పుని నేతిలో  వేయించాలి.
►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది.


►కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది.
►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి.
►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది.

చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement