షిర్డీ సంస్థాన్‌కు 4.26 కోట్ల ‘రామ నవమి’ ఆదాయం | Shirdi Sansthan gets 4.26 crores 'Navami income | Sakshi
Sakshi News home page

షిర్డీ సంస్థాన్‌కు 4.26 కోట్ల ‘రామ నవమి’ ఆదాయం

Apr 9 2025 12:46 PM | Updated on Apr 9 2025 1:04 PM

Shirdi Sansthan gets 4.26 crores 'Navami income

సాయినాథునికి 83.3గ్రా. బంగారం, 

2 కేజీలకు పైగా వెండి సమర్పించిన భక్తులు 

శిర్డీ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీలో శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5 నుంచి మొదలైన శ్రీరామ నవమి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల సమయంలో 2.5లక్షల మంది సాయినాధుని దర్శించుకున్నారని, సంస్థానానికి రూ.4.26 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థాన్‌ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భీమ్‌రాజ్‌ దారాడే మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే భక్తులు 83.3 గ్రాముల బంగారం, 2,030 గ్రాముల వెండి సమర్పించినట్లు పేర్కొన్నారు.  

షిర్డీ  ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడికి ప్రపంచము నలుమూలల నుండి సాయి భక్తులు వస్తుంటారు. సాయికి భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఇదీ చదవండి: ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి


 

 

Advertisement
 
Advertisement
Advertisement