
సంక్షేమంలో ఛాంపియన్లుగా పేరుపొందిన తెలుగు రాష్ట్రాలు పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం పక్కన పెడుతున్నట్లున్నది! 1,000 నుంచి 2,500 రూపా యల పీఎఫ్ పెన్షన్ మాత్రమే అందుకొంటూ విశ్రాంత జీవితాన్ని నానాపాట్లూ పడుతూ గడుపుతున్న 60 ఏళ్లు పైబడిన విశ్రాంత పాత్రికేయులను పట్టించు కోవడం లేదని... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తూ, పీఎఫ్ చందాలు కడుతూ పాత్రికేయులకు అండగా, ఆలంబనగా నిలుస్తున్న సంస్థలు పరి మితమే. ఉద్యోగ భద్రత, నెలవారీగా వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేకుండా జీవితాన్ని గడిపే పాత్రికేయులే ఇప్పడు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు రిటైరైన తర్వాత కూడా కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడిన పాత్రికేయులు రిటైరయ్యాక ఎవరూ పట్టించుకోని దైన్యస్థితిలో బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్ష రాన్నే నమ్ముకుని ఉన్న వేలాదిమంది పాత్రికే యుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే తీసికట్టుగా తయారైంది.
చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
నిజానికి, తెలుగు రాష్ట్రాలు తప్ప దేశంలో మరో 19 రాష్ట్రాలు విశ్రాంత పాత్రికేయులకై పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా నెలకు రూ. 20 వేల చొప్పున పెన్షన్‌ను 60 ఏళ్ళు పైబడిన పాత్రికేయులకు అందజేస్తోంది. అసోం నెలకు రూ. 5 వేలు, ఛత్తీస్‌గఢ్ 10 వేలు, గోవా 10 వేలు, హరియాణా 10 వేలు, మన పొరుగునే ఉన్న కర్ణాటక 10 వేలు, కేరళ 11 వేలు చెల్లిస్తున్నాయి. పంజాబ్‌లో 12 వేలు, రాజస్థాన్‌లో 15 వేలు, తమిళనాడులో 12 వేలు, త్రిపురలో 10 వేల చొప్పున విశ్రాంత జీవితం గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్‌గా అందచేస్తున్నారు.
ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు
తెలుగు రాష్ట్ర్రాలు వందల కోట్ల నిధులతో లక్షలమందికి సామాజిక పెన్షన్‌లు అందచేస్తున్నాయి. అయితే అరకొర ఆదాయంతో రిటైర్మెంట్ జీవి తాన్ని గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్ వసతి కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పాత్రికేయులకు పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆ వాగ్దానాన్ని గుర్తుచేశారు విశ్రాంత పాత్రికేయులు. త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలనూ కలిసి వినతిపత్రం సమర్పించ నున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం కావాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం తీర్మానం చేసింది. అక్షరాన్ని నమ్ముకొని, సమాజానికి మార్గదర్శనం చేసిన వయోధికులకు పాలకులు అండనివ్వాలి.
– చొప్పరపు కృష్ణారావుపాత్రికేయుడు
84668 64969