తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు?

Sakshi Devotional Prashnottara Bharatam

ప్రశ్నోత్తర భారతం

ప్రశ్న: తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు?
జవాబు : కుంతిని వారి ఇంటికి పంపాడు

ప్రశ్న:  ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంది?
జవాబు : వారి ఇల్లు అల్లకల్లోలంగా ఉంది. బంధువులు, జనులు అందరూ దుఃఖిస్తున్నారు. యజమాని కన్నీరు కారుస్తున్నాడు

ప్రశ్న:యజమాని విలపిస్తూ బంధువులతో ఏమన్నాడు?
జవాబు : నా భార్యను రాక్షసుడికి అర్పించాలి. ఆమె రక్షణ బాధ్యత నా మీద ఉంది. నా కూతురుని పంపలేను. ఆమెకు పెండ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నా కుమారుడు చిన్నవాడు. వాడు వృద్ధిలోకి రావాలి. అందువల్ల నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అన్నాడు

ప్రశ్న:యజమాని మాటలకు అతని భార్య ఏమంది?
జవాబు : ఆపద వచ్చినప్పుడు విచారించకూడదు. ఎదిరించాలి. మీకు పుత్రులను ఇచ్చాను. నా ఋణం తీరింది. నేను ఉన్నప్పటికీ పిల్లల్ని పోషించలేను. మిమ్మల్ని వదిలి జీవించలేను. మీరు జీవించి ఉండాలి. నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను.. అంది

ప్రశ్న: కూతురు ఏమంది?
జవాబు : తల్లిదండ్రులారా! ఎంతకాలం ఉన్నా, నేను పరుల ఇంటికి వెళ్లవలసినదానిని. మీరు జీవించి ఉంటే, బిడ్డలను పొందవచ్చు. నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అంది

ప్రశ్న: కుమారుడు ఏమన్నాడు?
జవాబు : నేను రాక్షసుడిని చంపుతాను అంటూ కర్ర పట్టుకుని ఉరికాడు. అంత దుఃఖంలోనూ బాలుని మాటలు విని అందరూ నవ్వారు

ప్రశ్న: అంతా విన్న కుంతి ఏం చేసింది?
జవాబు : వారిని ఓదార్చి అసలు కథ అడిగింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top