అంటార్కిటికాలో ఆశాకిరణం.. | Research On Cancer By University Of South Florida Scientists | Sakshi
Sakshi News home page

అంటార్కిటికాలో ఆశాకిరణం..

Jul 3 2026 8:19 AM | Updated on Jul 3 2026 10:47 AM

Research On Cancer By University Of South Florida Scientists

శోధన

క్యాన్సర్‌ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా (యూఎస్‌ఎఫ్‌) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది.

అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్‌లో క్యాన్సర్‌ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్‌ సీ స్క్విర్ట్‌ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్‌ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు.

‘సీ స్క్విర్ట్‌’ను అసిడియన్స్‌ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్‌ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్‌ డిఫెన్స్‌) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి.
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు.

క్యాన్సర్‌  నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్‌ డీఎన్‌ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement