breaking news
University of South Florida
-
అంటార్కిటికాలో ఆశాకిరణం..
క్యాన్సర్ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (యూఎస్ఎఫ్) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది.అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్లో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్ సీ స్క్విర్ట్ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు.‘సీ స్క్విర్ట్’ను అసిడియన్స్ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్ డిఫెన్స్) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు.క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్ డీఎన్ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అమెరికా వర్సిటీలో కలాం ఫెలోషిప్
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం అరుదైన గుర్తింపును ఇచ్చింది. ఆయన గతంలో తమ యూనివర్సిటీని సందర్శించడాన్ని గౌరవిస్తూ ఆయన పేరిట డాక్టోరియల్ గ్రాంట్స్ ను ఏర్పాటుచేసింది. 'ఏపీజే అబ్దుల్ కలాం ఫెలోషిప్' అని దానికి పేరు పెట్టింది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా(యూఎస్ఎఫ్)ను అబ్దుల్ కలాం 2012లో సందర్శించారు. ఆ సమయంలో ఆయన మొత్తం ఆ యూనిర్సిటీ బృందంపై తిరుగులేని ప్రభావం చూపించారు. ఆ సందర్భాన్ని గౌరవిస్తూ ఏకం రూ.1,03,71,660ల ఫెలోషిప్ ను ప్రారంభించింది. శాస్త్రసాంకేతిక రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఫెలోఫిప్ ను అందిస్తారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ అబ్దుల్ కలాం పేరిట ఒక ఫెలోషిప్ ను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. 2016-17 నుంచి ఈ ఫెలోషిప్ అందించనున్నారు.


