పాస్ట్‌ కు  పోదాం  చలో చలో!  | Photography old cameras special story | Sakshi
Sakshi News home page

పాస్ట్‌ కు  పోదాం  చలో చలో! 

Jan 24 2024 2:23 PM | Updated on Jan 24 2024 3:07 PM

Photography old cameras special story - Sakshi

వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌బలమైన పునాది΄ాత ఫ్యాషన్‌లు కొత్త ట్రెండ్‌ కావడం  మనకు కొత్తకాదు. డిజిటల్‌ ఫొటోగ్రఫీ  ఒక రేంజ్‌లో ఉన్న ఈ కాలంలోనూ యువత  కాలం వెనక్కి వెళ్లి పాత కెమెరాలను  పలకరిస్తోంది. ఫిల్మ్‌ ఫోటోగ్రఫీపై మనసు పారేసుకుంటుంది. పాత కెమెరాలు కొత్తతరం చేతుల్లోకి వస్తున్నాయి.  యూట్యూబ్‌లో అనలాగ్‌ ఫొటోగ్రఫీ  ట్యుటోరియల్స్‌కు ఆదరణ పెరుగుతోంది.  పాత ఇల్‌ఫర్డ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫిల్మ్‌లు  కొత్తగా దిగుమతి అవుతున్నాయి.  ఈ రీసర్జెన్స్‌ ధోరణి గురించి..పాస్ట్‌ కు  పోదాం  చలో చలో! 

హైయర్‌ రిజల్యూషన్స్, తక్కువ వెలుతురులో కూడా బెటర్‌ పర్‌ఫార్మెన్స్, స్మార్ట్‌ ఫోకసింగ్,షేక్‌ రిడక్షన్‌... లేటెస్ట్‌ డిజిటల్‌ కెమెరాల గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ యువతలోని ఫొటోగ్రఫీ ప్రేమికులు కొందరు కాలం వెనక్కి వెళుతున్నారు. తాము పుట్టని కాలంలో ఉపయోగించిన కెమెరాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

డిజిటల్‌ కెమెరా ఇండస్ట్రీ శిఖరస్థాయిలో ఉన్న ఈ కాలంలో ΄ాత కెమెరాలకు ఆదరణ, అది కూడా యూత్‌ నుంచి ఆనేది ఆశ్చర్యకరమైన విషయమే.
దిల్లీలోని చాందిని చౌక్‌లో రెండు దశాబ్దాలుగా కెమెరాలను రీపేర్‌ చేస్తున్నాడు కపిల్‌ ఇంద్రజిత్‌ వోహ్ర. ఇతడి పేరు ఫిల్మ్‌–ఫొటోగ్రఫీ ప్రేమికులలో ΄ాపులర్‌ అయింది. కొంతకాలం వరకు వయసు మళ్లిన వారే తమ దగ్గరకు ΄ాత కెమెరాలను పట్టుకువచ్చేవారు. ఇప్పుడు యూత్‌ ఎక్కువగా వస్తున్నారు. కెమెరాల గురించి తమ సందేహాలను అడుగుతుంటారు.యూత్‌ పాత కెమెరాలను పట్టుకొని తన దగ్గరకు రావడం, వింటేజ్‌ కెమెరాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం వోహ్రాకు చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది.

‘ఇదొక వేవ్‌’ అంటాడు వోహ్ర.
కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ΄ాత కెమెరా పట్టుకొని వోహ్ర దగ్గరికి వచ్చాడు. 22 వేలకు కెమెరాను అమ్మాలని చె΄్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట వింటే ‘ఆశ–దోశ–అప్పడం వడ’ అనే మాట కచ్చితంగా వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు పాత కెమెరా కొనుగోలు విషయంలో డబ్బు గురించి చాలామంది ఆలోచించడం లేదు.

మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా అనలాగ్‌ ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. యూట్యూబ్‌లో అనలాగ్‌ ఫొటోగ్రఫీ ట్యుటోరియల్‌ చానల్స్‌కు ఆదరణ లభిస్తోంది. గత రెండు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ పేజీలు, వాట్సప్‌ గ్రూప్‌లలో ΄ాత కెమెరాలకు సంబంధించిన విషయాలు, విశేషాలు, టిప్స్‌ అండ్‌ ట్రిక్స్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. డిజిటల్‌ కెమెరాలో ఆటోమేటిక్‌ మోడ్‌లో యాంత్రికంగా షూట్‌ చేయడం చాలా సులభం. అయితే సృజనాత్మక ఫొటోగ్రఫీ లోతు΄ాతులు తెలుసుకోడానికి ΄ాత కెమెరాలు ఉపయోగపడుతున్నాయి.

పాతతరం ఫోటోగ్రఫీపై యూఎస్, యూరప్‌లలో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసక్తి ఇప్పుడు ఇండియా వరకు వచ్చింది. ‘ఆసియా–పసిఫిక్‌లలో ఫిల్మ్‌ ఫొటోగ్రఫీలో గణనీయమైన పెరుగుదల కనిపించింది’ అంటున్నాడు కొడాక్‌ అలారిస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ క్లారా లో. వినియోగదారులలో 18–26 సంవత్సరాల వయసు మధ్య వారు కూడా ఉన్నారు.
‘ఫిల్మ్‌ ఫొటోగ్రఫీపై ఆసక్తి, ఆదరణ భారీగా పెరిగాయి. అసలు సవాలు ఏమిటంటే ఫిల్మ్, కెమికల్స్‌ చాలామందికి అందుబాటులో లేవు. డిస్ట్రిబ్యూటర్లు లేరు’ అంటున్నాడు చెన్నైకి చెందిన ఫొటోగ్రాఫర్‌ వరుణ్‌ గు΄్తా. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పు వస్తోంది. కోల్‌కతాకు చెందిన ఫొటోల్యాబ్‌ ‘ఈస్టర్న్‌ ఫొటోగ్రాఫిక్స్‌’ ఇల్‌ఫర్డ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫిల్మ్‌ స్టాకును మన దేశానికి తీసుకురావడం మొదలుపెట్టింది. చెన్నైలోని ‘సృష్టి డిజిటల్‌ లైఫ్‌’ ఇండియాలో ‘ఇల్‌ఫర్డ్‌’ అధికారిక పంపిణీదారుగా మారింది. ‘లాభాలను ఆశించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. భావోద్వేగాలతో కూడిన నిర్ణయం’ అంటున్నాడు ‘సృష్టి డిజిటల్‌ లైఫ్‌’ డైరెక్టర్, సీయీవో ఆర్‌.విజయ్‌ కుమార్‌.

చివరాఖరికి చెప్పొచ్చేదేమింటంటే...
ఫోటో తీయడానికి ఇప్పటి డిజిటల్‌ కెమెరాలలోని మీట నొక్కితే సరి΄ోతుంది. మనం ఫొటోగ్రాఫర్‌ అయి΄ోయినట్లే. అయితే ఎనలాగ్‌ షూటింగ్‌కు ఏ మీట ఎక్కడ ఉందో మాత్రమే తెలిసుంటే చాలదు. గ్లామర్‌ తెలియాలి. గ్రామర్‌ తెలియాలి. అందుకు పాత కెమెరాలే కొత్త ΄ాఠశాలలు.
 ఫొటోగ్రఫీకి సంబంధించిన ్ర΄ాథమిక శిక్షణ ఏ యూనివర్శిటీలోనూ తీసుకోలేదు. అయితే యూట్యూబ్‌ వీడియోల నుంచి ్ర΄÷ఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ వరకు నేర్చుకునే అవకాశం ఎక్కడ ఉన్నా నేర్చుకున్నాను. ఫొటోగ్రఫీలోని అత్యాధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాదు గత కాలపు టెక్నాలజీ గురించి తెలుసుకున్నాను. గతకాలపు ఫొటోగ్రఫీ సాంకేతికత గురించి అవగాహన చేసుకోవడం అంటే బలమైన పునాది ఏర్పాటు చేసుకోవడం లాంటిది. ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్న వారు చదువు, ఉద్యోగం వదులుకోకుండానే ఎంజాయ్‌ చేయవచ్చు. ΄్యాషన్‌ను కెరీర్‌గా మలుచుకోవాలనుకుంటే మాత్రం రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి.

– అపురూప వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement