Ananya Sritam Nanda: ఏదో ఒకరోజు సింగర్‌ అనన్య నంద సైంటిస్ట్‌ కావడం ఖాయం!

Odisha: Meet Young Multi Talented Singer Ananya Sritam Nanda - Sakshi

సైంటిస్ట్‌ కావడమే లక్ష్యం

ఒడిషాలోని భువనేశ్వర్‌కు చెందిన అనన్య శ్రీతమ్‌ నంద ‘స్కూల్‌ టాపర్‌’ అనే మెచ్చుకోలు దగ్గరే ఆగిపోనక్కర్లేదు. చదువులో కూడా ఆమె సూపర్‌స్టార్‌! చిన్నప్పుడు హిందుస్థానీ రాగాలు నేర్చుకుంది. హార్మోని వాయించడంలో ప్రావీణ్యం సంపాదించింది. నాట్యంలోనూ నందాకు ప్రవేశం ఉంది.

ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ 1లోకి అడుగుపెట్టినప్పుడు నందాకు నిరాశ ఎదురైంది. అయినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగివచ్చి ‘ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ 2’ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం వచ్చింది.

‘మోదీజీని కలుసుకునే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంత బిజీ హెడ్యూల్‌లో కూడా 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ రోజును ఎన్నటికీ మరిచిపోలేను’ అంటుంది అనన్య. యూనివర్శల్‌ మ్యూజిక్‌ లేబుల్‌పై తన తొలి ఆల్బమ్‌ ‘మౌసమ్‌ మస్తాన’ విడుదల చేసింది. దీనికి మంచి స్పందన లభించడంతో బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి.

‘ఎంఎస్‌ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమాతో బాలీవుడ్‌లో సింగర్‌గా తొలి అడుగు వేసింది అనన్య. కలర్స్‌ టీవి ‘రైజింగ్‌ స్టార్‌’లో పాల్గొని టాప్‌ 5లో నిలిచింది. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అనే ప్రశ్నకు నంద నుంచి...‘సింగర్‌గా మంచి పేరు తెచ్చుకోవడం. కొత్త ఆల్బమ్‌లను తీసుకురావడం...’ అనే జవాబు వస్తుందని అనుకుంటాం. అయితే తన లక్ష్యం సైంటిస్ట్‌ కావడం అని చెబుతుంది నంద. చదువులో ఆమె ప్రతిభను గమనిస్తే ‘ఏదోఒకరోజు అనన్య నంద సైంటిస్ట్‌ కావడం ఖాయం’ అని ఖాయంగా అనుకుంటాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top