
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.
ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్‌బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.
ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!