
లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలతో ఈ సారి ‘దాండియా మస్తీ–2025’ నగర వాసులను సందడి చేస్తోంది.. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నానకరాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా వేడుకలు సోమవారం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్, డాన్స్ లైక్ నెవర్ బిఫోర్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు దీపికా బాజీ రెడ్డి, నటి అరియానా గ్లోరీ, నటుడు రామ్ కార్తిక్, డీజే కిమ్, డీజే ఫ్లోజా, డీజే వినీష్, డీజే రిషి, డీజే హరీష్, డీజే వివాన్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. దాండియా మస్తీ 2025లో ప్రత్యేక ఆకర్షణలుగా లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ భాగస్వాములుకానున్నారు. గర్బా మ్యూజిక్, బాలీవుడ్ ట్విస్ట్, స్టేజ్ సెటప్, థీమ్ డెకర్, స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్, ఓపెన్ అరేనాతో పాటు లైవ్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దీపికా బాజీ రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ బెస్ట్ డ్రెస్, బెస్ట్ డ్యాన్సర్ విజేతలకు సిల్వర్ కాయిన్స్ బహుమతులు, పిల్లలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. మహిళలకు 1+1 టికెట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాండియా మస్తీ టికెట్లు బుక్ మై షో, 95533 06329, 77023 99188, 97040 0162 నంబర్లలో పొందవచ్చు.
‘ఆరో రియాలిటీ’లో బతుకమ్మ..
నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని కోహినూర్ ఆరో రియాలిటీ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పలువురు ఔత్సాహిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
(చదవండి: వయసులకు అతీతం.. ఆధ్యాత్మిక పర్యాటకం..)