తులసి ఆకుల గుజ్జు, శనగపిండి.. మోము మెరిసేలా! | Natural Beauty Tips For Glowing Face Neck | Sakshi
Sakshi News home page

Beauty Tips: మోము మెరిసేందుకు.. తులసి ఆకుల గుజ్జు, కమలా జ్యూస్‌, శనగపిండి ఇంకా..

Apr 7 2022 3:16 PM | Updated on Apr 8 2022 9:35 AM

Natural Beauty Tips For Glowing Face Neck - Sakshi

మోము మెరుపు కోసం మార్కెట్టులో దొరికే లోషన్లు, క్రీముల వంటివి ఎన్ని కొనుగోలు చేసి వాడినా... తాత్కాలిక మెరుపు తప్ప శాశ్వతమైన కాంతి సొంతం కాదంటున్నారు. అందుకే ముఖసౌందర్యానికి కాస్త సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది.

కావల్సినవి:  క్లీనప్‌ : రోజ్‌ వాటర్‌ – 2 టీ స్పూన్లు; స్క్రబ్‌ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు; మాస్క్‌:  తులసి ఆకుల గుజ్జు  – 1 టీ స్పూన్, కమలా జ్యూస్‌ – అర టీ స్పూన్, శనగపిండి – 1 టీ స్పూన్‌

తయారీ:  
►ముందుగా మెత్తని క్లాత్‌ తీసుకుని.. రోజ్‌ వాటర్‌తో ముఖం, మెడ క్లీన్‌ చేసుకోవాలి.
►ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి.
►తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి.
►ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు,  కమలా జ్యూస్, శనగపిండి కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి.
►ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
►ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడంతో పాటు రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.  

చదవండి: Summer Tips: స్విమ్‌ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement