స్విమ్‌ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి! | Summer: Important Swim Safety And Skin Care Tips | Sakshi
Sakshi News home page

Summer Tips: స్విమ్‌ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!

Apr 6 2022 10:21 AM | Updated on Apr 6 2022 3:57 PM

Summer: Important Swim Safety And Skin Care Tips - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Swim Safety And Skin Care Tips In Summer: వేసవి కాలంలో స్విమ్మింగ్‌ చేయడానికి చాలామంది ఇష్టపడ్డప్పటికీ, మరోవైపు చర్మం పాడైపోతుందని బాధపడతుంటారు. ఎటువంటి ఆందోళన చెందకుండా స్విమ్మింగ్‌ ఎలా చేయవచ్చో చూద్దాం..  

►ఉదయం పది గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తరువాత స్విమ్మింగ్‌ చేయాలి.
►పూల్‌లో దిగడానికి కనీసం ఇరవై నిమిషాల ముందు వాటర్‌ప్రూఫ్‌ సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి.
►కళ్లను చక్కగా కవర్‌ చేసి, భద్రంగా కాపాడే కళ్లజోడుని తప్పనిసరిగా ధరించాలి.
►ఎటువంటి రంధ్రాలు లేని క్యాప్‌ను తలకు పెట్టుకోవాలి.
►దీనివల్ల నీటిలో ఉన్న రసాయనాలు, క్లోరిన్‌ వంటివి జుట్టుకు హాని చేయవు.
►స్విమ్మింగ్‌ అయిన వెంటనే తప్పనిసరిగా స్నానం చేయాలి.
►తరువాత తడిలేకుండా ఒంటిని తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
►డైమెథికోన్, గ్లిజరిన్, ఆయిల్‌ లేదా పెట్రోలేటియం ఉన్న మాయిశ్చరైజర్‌ వాడితే మరింత మంచిది.
►స్విమ్మింగ్‌కు వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తరువాత రెండుసార్లు మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మరింత మంచిది.  

చదవండి: Health Tips: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement