Health Tips: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే!

Summer Care: Top 12 Health Benefits Of Cucumber Keera Dosa In Telugu - Sakshi

కీరా... ఆరోగ్యానికి ఆసరా 

Health Benefits Of Cucumber: మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్‌లా తింటుంటారు. కీర దోస ఉపయోగాలను తెలుసుకుందాం.

కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్‌ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. 
కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి.
కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి.


దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి.
కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌ అవకుండా కాపాడుతుంది. 
దీనిలో ఉండే విటమిన్‌ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. 
కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.
ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది.
కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా ఉంటాయి.  

చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top