క్యాన్సర్‌ ఒత్తిడి తగ్గిం‍చుకోవాలంటున్నారా? అయితే..

Mushroom Reduces Cancer Stress Special Story In Telugu - Sakshi

క్యాన్సర్‌ వచ్చిందని తెలిస్తే ఓ రోగి ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో తెలియంది కాదు. అయితే... క్యాన్సర్‌ పూర్తిగా తగ్గాక కూడా కొందరిలో ఒక రకమైన మానసిక వేదన ఉంటుంది. తమకు వచ్చిన క్యాన్సర్‌ పూర్తిగా తగ్గినప్పటికీ... అంతకు ముందు వారు ఆ వ్యాధి వల్ల కలిగిన షాక్‌ కారణంగా కొందరు ‘ఎగ్జిస్టెన్షియల్‌ డిస్ట్రెస్‌’ అనే మానసిక సమస్యకు గురవుతారు. చాలా వేగంగా ప్రయాణం చేస్తున్న వాహనంలో ప్రయాణం చేస్తూ ఆ వేగపు తీవ్రతను అనుభవిస్తున్నవారు కాస్తా.... వాహనం వేగం తగ్గాక కూడా అంతకు ముందు తాను అనుభవించిన ఉద్విగ్నతను మరికాసేపు కొనసాగించినట్లుగానే... క్యాన్సర్‌ తగ్గాక కూడా ఆ ముందు అనుభవించిన వేదనలోనే మరికొంతకాలం పాటు కొనసాగుతారు.  

అయితే సైలోసైబన్‌ మష్రూమ్స్‌ అనే ఒక రకం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునే వారిలో ఈ తరహా మానసిక సమస్య తీవ్రత అంతగా ఉండదని పేర్కొంటోంది ఒక హెల్త్‌ జర్నల్‌. ఈ మష్రూమ్‌ను ఆహారంగా తీసుకున్నా లేదా దీని నుంచి దీని నుంచి తయారు చేసిన సైలోసైబిన్‌ అనే డ్రగ్‌ను తీసుకున్నా కూడా ఇదే ప్రభావం ఉంటుందని పేర్కొంటోంది ‘హెల్త్‌ డే’ అనే హెల్త్‌ జర్నల్‌. సైలోసైబిన్‌ను తీసుకున్న వారు ఒక రకమైన హాయి గొలుపుతున్న ఫీలింగ్‌ను పొందుతుంటారట. అందుకే దీన్నే సైకెడెలిక్‌ మష్రూమ్‌ అని కూడా అంటారని ఆ జర్నల్‌కు చెందిన  ప్రతినిధి స్టీవెన్‌ రెయిన్‌బర్గ్‌ పేర్కొంటున్నారు. 

మామూలుగానైతే సైలోసైబిన్‌ను నరాలకు సంబంధించిన జబ్బుల్లోనూ, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) అనే మానసిక రుగ్మతలోనూ సాధారణంగా ఉపయోగిస్తుంటారు. అయితే అనేక మంది క్యాన్సర్‌ రోగుల నుంచి సేకరించిన వివరాలను బట్టి కీమోథెరపీ తర్వాత క్యాన్సర్‌ నయమైన రోగులనుంచి తీసుకున్న వివరాల ప్రకారం... క్యాన్సర్‌ రోగులలోనూ ఇది చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తేలింది. దాంతో ఆ రసాయనం పుష్కలంగా ఉండే మ్యాజిక్‌ మష్రూమ్స్‌ను ఆహారం తీసుకోవడం వల్ల కూడా అదే ఫలితం దొరుకుతుందని పేర్కొంటోంది ‘హెల్త్‌ డే’ అనే హెల్త్‌ జర్నల్‌. 

చదవండి: మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదా? 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top