కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి!

Published Sat, May 25 2024 9:43 AM

Muscles Aching But Do This And Benifits Precautions

రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏ బాత్‌ రూమ్‌కో వెళ్లాల్సి వచ్చి కాలు కింద పెడదామని చూస్తే అడుగు ముందుకు పడదు. పిక్కలు, కండరాలు పట్టేసినట్లుంటుంది. చాలామందికి ఇదొక బాధాకరమైన అనుభవం. అంతేనా.. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడవాల్సి వస్తుంతది. ఒక్కోసారి మంచి చలికాలంలో వేళ్లు కొంకర్లుపోయినట్లుగా అయి΄ోయి ఎంత ప్రయత్నించినా  అవి అలాగే బిగుసుకు΄ోయి బాగా నొప్పితో పళ్ల బిగువున బాధను అణిచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. దీనినే కండరాలు పట్టెయ్యడం లేదా మజిల్‌ క్రాంప్స్‌ అంటారు. దీనికి కారణాలు, నివారణోపాయాలను తెలుసుకుందాం.

మనం శారీరక శ్రమ చేసినప్పుడు చెమటతో పాటు ఉప్పు రూపంలో సోడియమ్‌ ను కూడా చాలా వరకూ కోల్పోతాం. సోడియమ్‌ తగ్గడం వల్ల శరీరంలోని కండరాలు...ముఖ్యంగా పిక్క, తొడ, భుజం కండరాలు పట్టేసినట్లుగా నొప్పికి గురవుతాయి. అందుకే చాలామందికి ఎండాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతుంది. వేసవికాలంలో ఆటగాళ్లు చాలామంది ఈ సమస్యకు గురవుతుంటారు. ఇంకా కొందరిలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా సోడియమ్‌ను కోల్పోతారు. అలాంటివారిలో కూడా ఒళ్లు నొప్పులు రావడం, నీరసపడి΄ోవడం జరుగుతుంది.

కారణాలు...
మహిళల్లో చాలామంది కుటుంబ సభ్యులకు తినిపించడంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, తాము తినడానికి రెండో ్రపాధాన్యత ఇస్తుండటం వల్ల వారికి తగిన క్యాల్షియం, ఇతరపోషకాలూ సరిగా అందక ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా... 

థైరాయిడ్‌..
మన శరీరంలోని థైరాయిడ్‌ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల వచ్చే వ్యాధిని హై΄ోథైరాయిడిజమ్‌ అంటారు. హై΄ోథైరాయిడ్‌ ఉన్నవారికి మజిల్‌ క్రాంప్స్‌ ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఎక్కువ దూరం పరుగెత్తలేరు. మహిళలకైతే రాత్రి సమయంలో పిక్కలు నొప్పిపెడుతుంటాయి. మగవారు కూడా ఎక్కువ దూరం నడవలేరు.

శరీరం ద్రవాలు కోల్పోవడం..
సాధారణంగా శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు΄ోతాయి. వాంతులు, విరేచనాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, శారీరక శ్రమ వల్ల కూడా ఇలా కావచ్చు. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళన, పని ఒత్తిడి, టైట్‌ షెడ్యూల్స్, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు మజిల్‌ క్రాంప్‌ సమస్య అధికంగా ఉంటుంది.

నివారణ..

  • వేసవిలో వచ్చే మజిల్‌ క్రాంప్స్‌ నివారణకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నుండి ద్రవాలను కోల్పోకుండా చూసుకోవాలి.

  • ఒకవేళ ఎక్కువగా ద్రవాలను కోల్పోయే పరిస్థితి ఉంటే నిమ్మకాయ రసంలో ఉప్పు కలుపుకుని తాగడం లేదా కొబ్బరినీళ్లు తాగడం... ఈ రెండూ అందుబాటులో లేక΄ోతే కనీసం కాసిని మంచి నీరు తాగడం. తాజాపండ్లు తినడం మంచిది.

  • క్యాల్షియమ్‌ లోపం వల్ల మజిల్‌ క్రాంప్స్‌ వస్తుంటే క్యాల్షియమ్‌ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. దానికి మనం తినే ఆహారంలో పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

  • చలి కారణంగా వచ్చే మజిల్‌ క్రాంప్స్‌ను నివారించడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. చలికి ఎక్కవగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి.

  • ఒత్తిడి వల్ల కూడా మజిల్‌ క్రాంప్స్‌ వస్తాయి. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి ∙హై΄ోథైరాయిడిజమ్‌ వల్ల వచ్చే మజిల్‌ క్రాంప్స్‌ను తగ్గించడానికి తగిన చికిత్స తీసుకోవాలి.

ఇవి చదవండి: ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!

Advertisement
 
Advertisement
 
Advertisement