అలాంటి వ్యక్తి దొరకాలి! | Mrunal Thakur recently opened up about marriage | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యక్తి దొరకాలి!

Apr 26 2026 1:21 AM | Updated on Apr 26 2026 1:21 AM

Mrunal Thakur recently opened up about marriage

చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్‌ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్‌ ఠాకూర్‌. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్‌. బాడీ ఇమేజ్‌ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్‌ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..

గాసిప్స్‌? నవ్వేసి ముందుకెళ్తాను!
నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి  వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్‌ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.

ట్రోల్‌ చేసినా.. నిలబడ్డాను!
బాడీ షేమింగ్‌ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.

బ్రేకప్‌ ఇచ్చిన బలం
ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్‌ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్  ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్‌ నన్ను మరింత బలంగా మార్చింది.

అమ్మకు ఇచ్చిన మాట!
చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.

చీకటి దశ నుంచి వెలుగులోకి!
నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్‌ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్‌ పాత్రలు చేసినా, టెలివిజన్  నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. 
అదే నా పునాది.

నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!
నా కెరీర్‌ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి.  కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్‌ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement