ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు.. | Microsoft Techie Recalls Father Selling Mother's Gold Bangles Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..

Jul 6 2026 11:46 AM | Updated on Jul 6 2026 12:37 PM

Microsoft Techie Recalls Father Selling Mother's Gold Bangles Goes Viral

మధ్యతరగతి కుటుంబంలో పిల్లల చదువులు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంటుంది. అయితే వాళ్లు చేసిన త్యాగాలకు అనుగుణంగా ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఉండదు. అలాంటి కథే నెట్టింట వైరల్‌గా మారింది. 

మైక్రోసాప్ట్‌ ఉద్యోగి లిక్డ్‌ఇన్‌లో షేర్‌ చేసిన భావోద్వేగ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఆయన తన కాలేజీ ఫీజు చెల్లించడం కోసం తన తల్లి బంగారు గాజులు అమ్మిన భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు. తాను బీసీఏ చదువుతున్నప్పుడూ తన సెమిస్టర్‌ ఫీజుల కట్టడం కోసం పేరెంట్స్‌ ఎంతగా ఇబ్బందిపడ్డారో గుర్తుచేసుకున్నారు. ఆ ఫీజు కోసం ఒకరోజు అమ్మ బంగారు గాజులు తీసి ఇచ్చిన ఘటన ఇప్పటికీ మర్చిపోనన్నారు. 

ఆ రోజు అమ్మ ఏ మాత్రం బాధపడకుండా అమ్మడానికి ఆభరణాలు ఇచ్చింది. ఆ రోజు అమ్మ చేసిన త్యాగం కారణంగా తాను మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించగలిగానని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేసి ఐటీ రంగంలో పనిచేస్తూ..వార్షిక ఆదాయం రూ .1.9 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నాని చెప్పారు. ఆ రోజు అమ్మ అలా బంగారపు గాజులు తీసిస్తున్నప్పుడు ఆమె బాధపడలేదు గానీ తనకు మాత్రం ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. 

ప్రస్తుతం తన పొజిషన్‌ మంచి స్థాయిలో ఉన్నాక..అమ్మ నీకు కావల్సిన బంగారం కొనుక్కోమని చెప్పగా..అరే బేటా నువ్వు వచ్చాక నాకు అన్ని తిరిగి దక్కాయి. అప్పులనే ఆర్థికపరమైనవి మాత్రమే అని తేలిగ్గా కొట్టిపారేసిందన్నారు. తన కథలా చదువు కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ఈ పోస్ట్‌ అంకితం అంటూ తన పోస్ట్‌ని ముగించారు.  ఈ పోస్ట్‌ నెటిజన్ల మనసును తాకింది. ఎన్నో కార్పొరేట్‌ ఉద్యోగుల విజయగాధ వెనుక తలిదండ్రుల నిశబ్ద త్యాగం ఉంటుందంటూ పోస్టులు పెట్టారు.

కాగా అతడి లిక్డ్‌ఇన్‌ ప్రొఫెల్‌ ప్రకారం..అగర్వాల్ 2016లో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌లో సమ్మర్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2017లో మైక్రోసాఫ్ట్‌లో పూర్తిస్థాయి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా చేరడానికి ముందు, ఆయన బెంగళూరులోని GE హెల్త్‌కేర్‌లో కూడా ఇంటర్న్‌షిప్ చేశారు. 

ఆ తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ రెడ్‌మండ్ (వాషింగ్టన్) కార్యాలయానికి మారారు, అక్కడ 2020 వరకు పనిచేశారు. బెంగళూరులోని గూగుల్‌లో రెండేళ్లకు పైగా పనిచేసిన తర్వాత, 2025లో బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తిరిగి చేరారు. 

(చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement