ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్ ప్లాన్ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.
రేమండ్ జెంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్ రెండేళ్లపాటు డల్లాస్‌లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్‌లు, స్టాక్‌లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు.
అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్‌లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్‌గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు.
అయితే జెంగ్ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్ స్పెడ్‌షీట్‌ని మెయింటైన్ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్ చేసుకుంటాడట. అంటే జాంగ్ అనుకున్న ప్రకారం.. ప్లాన్ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్ స్ట్రాటజీ.
(చదవండి: టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!)


