పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌.. కట్టిపడేస్తోన్న ప్రింటెడ్‌ లెహంగా | Lehenga Latest Design 2021: Printed Lehenga, Indo Western Lehenga | Sakshi
Sakshi News home page

Lehenga Latest Design 2021: లెహంగాకి వెస్ట్రన్‌ టచ్‌

Sep 3 2021 7:43 PM | Updated on Sep 3 2021 7:50 PM

Lehenga Latest Design 2021: Printed Lehenga, Indo Western Lehenga - Sakshi

వేడుక ఏదైనా లెహంగా నేటికీ కొత్తగా మెరుస్తూనే ఉంది. అమ్మాయిల మనసు లెహంగా చుట్టూ అల్లుకుంటూనే ఉంది. ఎంబ్రాయిడరీతో మెరిపించినా, ప్యాచ్‌లు జత చేర్చినా పువ్వులు సింగారించినా, ప్రింట్లు సందడి చేసినా వెస్ట్రన్‌ టాప్‌ చేరాల్సిందే లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!

మెహందీ వేడుకల్లో ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ యువతను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే, ప్లెయిన్‌ బెల్‌ స్లీవ్స్‌ టాప్, ప్రింటెడ్‌ లెహంగా పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌గా కట్టిపడేస్తోంది.


ఫ్లోరల్‌: రంగురంగుల పువ్వులన్నీ లెహంగా డ్రెస్‌ మీద వచ్చి చేరినట్టు చేసిన డిజైన్‌ మెహిందీ వేడుకలకు మరిన్ని సొబగులను అద్దుతుతుంది. వేడుకను మరింత వైబ్రెంట్‌గా మార్చేస్తుంది. 


వెస్ట్రన్‌ కేప్‌కి ఇండియన్‌ స్టైల్‌ ఎబ్రాయిడరీతో ప్రింటెడ్‌ లెహంగాకు కొత్త రూపు తీసుకువచ్చి వేడుకలో హైలైట్‌గా వెలిగిపోవచ్చు అని చూపుతోంది ఈ డిజైన్‌. 


జాకెట్‌ స్టైల్‌ టాప్‌ కాంబినేషన్‌తో పూర్తిగా వెస్ట్రన్‌ లుక్‌ అనిపిస్తున్న లెహంగా డ్రెస్‌. సంప్రదాయ వేడుకలనూ స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తోంది. 


ఇండియన్‌ ఆర్కిటెక్చర్‌ థీమ్‌తో ఆకట్టుకునే డిజైన్స్‌ తీసుకువచ్చే పంజాబీ డిజైనర్‌ పరమ్‌సాహిబ్‌ రూపొందించిన లెహంగా. పూర్తి జరీ ఎంబ్రాయిడరీతో లెహంగా, వెస్ట్రన్‌ పెప్లమ్‌ టాప్‌తో జత చేసిన వేడుకలకు ఆకట్టుకునే లుక్‌ తీసుకువచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement