నవ్వుతూ ఉండాలి | Sakshi
Sakshi News home page

నవ్వుతూ ఉండాలి

Published Sun, Dec 17 2023 5:20 AM

Latest fashions followed by Mrinal Thakur - Sakshi

‘సీతారామం’లోని సీత.. మృణాల్‌ ఠాకూర్‌.. భారీ సక్సస్‌ సాధించినప్పటికీ సెలెక్ట్‌డ్‌గా సినిమాలు చేస్తూ సెపరేట్‌ స్టయిల్‌ క్రియేట్‌ చేసుకుంది. ఆ స్టయిల్‌నే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.మా నాన్నే నా బిగ్గెస్ట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ ఉండాలని నేర్పించారు. మంచి ఫలితాలకు సమయం పడుతుందని, సహనంతో వేచిచూడాలని చెబుతుంటారు. దాన్నే నమ్ముతాను!  – మృణాల్‌ ఠాకూర్‌

మృణాళినీ రావ్‌.. 
ఇండియన్‌ టాప్‌ డిజైనర్స్‌లో ఒకరైన మృణాళినీ రావ్‌ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! చిన్నప్పుడు డాక్టర్‌ కావాలనుకుంది. పెద్దయ్యాక ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దాంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది.

ఇంట్లోనే డిజైన్స్‌ను తయారుచేసి, వీకెండ్స్‌లో ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళినీ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించి, అతికొద్ది కాలంలోనే సెలబ్రిటీస్‌కు డిజైన్స్‌ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకే, ఈ బ్రాండ్‌ ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో లభిస్తాయి.

చీర బ్రాండ్‌: అర్పితా మృణాళినీ రావ్‌,రూ.1,79,000,  బ్లౌజ్‌ ధర:  రూ. 53,760
జ్యూలరీ బ్రాండ్‌: ఎ జ్యూయెల్స్‌ బై అన్‌మోల్‌, ధర: ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఎ జ్యూయెల్స్‌ బై అన్‌మోల్‌..
1986లో ఈశూ దత్వానీ అన్‌మోల్‌ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కేవలం వారి వద్ద తయారైన ఆభరణాలను మాత్రమే విక్రయించేవాడు. అంతర్జాతీయ స్థాయి డిజైన్స్‌ అందించటానికి విదేశీ డిజైనర్స్‌తోనూ కలసి పనిచేయటం మొదలుపెట్టాడు.

శిల్పా శెట్టీ, లారా దత్తా, మలైకా అరోరా, ఊర్వశి ఇలా పలు ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ వారి పెళ్లి నగలను ఇక్కడే డిజైన్‌ చేయించుకున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. -దీపిక కొండి

Advertisement
 
Advertisement