ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లేడీ ఎస్‌పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్‌లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్‌పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్‌పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.
కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ.
Comments
Please login to add a commentAdd a comment