పండు కొంచెం... రేటు ఘనం!ఈ చెర్రీలు ఒక్కోక్కటే ఏకంగా..రూ. 25 వేలు!

Japan Cherries Are Most Expensive In The World - Sakshi

మన దేశంలోని వివిధ నగరాల్లో సాధారణంగా చెర్రీలు కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటిని జూనో హార్ట్‌ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు. మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది.

వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల (సుమారు 25 వేలు) వరకు ధర పలుకుతాయి. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది. 

(చదవండి: హెల్తీగా రాగి డోనట్స్‌ చేసుకోండిలా..!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top