హెల్తీగా రాగి డోనట్స్‌ చేసుకోండిలా..!

How To Make Healthy Baked Ragi Flour Donuts - Sakshi

రాగి డోనట్స్‌కి కావలసినవి:  
మైదాపిండి – 1 కప్పు
పంచదార పొడి – 1 కప్పు
వైట్‌ వెనిగర్, వెనీలా ఎసెన్స్‌
బేకింగ్‌ సోడా – 1
టీ స్పూన్‌  చొప్పున
ఉప్పు – అర టీ స్పూన్‌
మజ్జిగ – 1 కప్పు
గుడ్లు – 2
రాగి పిండి–  2 కప్పులు
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్‌ సోడా, వెనీలా ఎసెన్స్‌, గుడ్లు, నూనె, వైట్‌ వెనిగర్, రాగిపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలిపి పెట్టుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లూ కలుపుకోవచ్చు. డోనట్స్‌ మేకర్‌కి కొద్దిగా నూనె రాసి, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్‌ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

(చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top