చిన్నారి సేవాగుణం | inspirational women | Sakshi
Sakshi News home page

చిన్నారి సేవాగుణం

Jul 18 2024 9:26 AM | Updated on Jul 18 2024 9:26 AM

 inspirational women

ఎంతోమంది విదేశాలకు వెళ్లిన తర్వాత పుట్టి పెరిగిన ప్రాతాన్ని మర్చిపోతుంటారు. కాని కరీంనగర్‌ నుంచి అమెరికా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి కుమార్తె సొంత ఊరిపై మమకారంతో అనాథ విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి అందించింది. ఈ రకంగా తన తల్లితండ్రులు పెరిగిన ఊరిపై ప్రేమను చాటుకుంది.

కరీంనగర్‌ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు లక్కాకుల వినయ్‌ అమెరికాలోని మిచిగాన్‌  లో నివసిస్తుండగా వారి కూతురు లక్కాకుల హరిణి అమెరికాలోని నోవి హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. హరిణి ΄ాఠశాల సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా రూ.1.65 లక్షల మేరకు విరాళాలు సేకరించింది. 

ఈ మొత్తాన్ని హరిణి కరీంనగర్‌ పట్టణంలోని వెంకట్‌ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులంలో 40 మంది అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులను గరపడంతో΄ాటు సకల సౌకర్యాలను కలుగజేస్తున్నారని తెలుసుకొని వారి అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. వయసులో చిన్న అయినా, పెద్ద మనసుతో విరాళాలు సేకరించి ఇచ్చిన హరిణికి బాలగోకులం విద్యార్థులు, వెంకట్‌ ఫౌండేషన్‌  సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement