
భార్గవ అనే వ్యక్తి పోలిస్‌స్టేషన్‌కు వచ్చి తన ఇంట్లో దాచిన బంగారు నగలను దొంగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు కోసం పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. కిటికీ పగలగొట్టబడి ఉంది.
ఇంటి ఆవరణ మొత్తం పరిశీలించిన తరువాత... ‘ఇంట్లో దొంగతనం జరగలేదు. భార్గవ అబద్ధం చెప్పాడు’ అని ప్రకటించాడు ఇన్‌స్పెక్టర్. ఏ ఆధారంతో అలా చెప్పాడో ఊహించగలరా?
మీరు సరిగ్గా ఊహించారో, లేదో తెలుసుకోవాలంటే.. ఫొటో కింద జవాబు చూసేయండి.
జవాబు: దొంగలు బయటి నుంచి కిటికీ అద్దం పగలగొట్టితే, అద్దం ముక్కలు ఇంట్లో పడాలి. కాని ఆ ముక్కలు బయటపడి ఉన్నాయి. అంటే భార్గవే... ఇంట్లో నుంచి అద్దాలు పగలగొట్టాడు!