పాలక్‌ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు

How To Make Palak Methi Puri Recipe In Telugu - Sakshi

పాలక్‌ మేథీ పూరీ తయారీకి కావల్సినవి:

జీలకర్ర – టేబుల్‌ స్పూను; సోంపు – టేబుల్‌ స్పూను; వాము – టీస్పూను;
నువ్వులు – టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – టేబుల్‌ స్పూను;
రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్‌ స్పూను;
ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్‌ స్పూను; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా
పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు;
పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు

తయారీ విధానం:
జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్‌ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్‌ స్పూను నూనె వేసి కలపాలి.

ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్‌ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్‌ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్‌ మేథీ పూరీ రెడీ. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top