Health Tips In Telugu: Pregnants Better To Avoid Aloe Vera Juice - Sakshi
Sakshi News home page

Health Tips In Telugu: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు!

Sep 15 2021 10:43 AM | Updated on Sep 15 2021 1:05 PM

Health Tips In Telugu: Pregnants Better To Avoid Aloe Vera Juice - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అనేక ఆరోగ్య సుగుణాలు ఉండడం వల్ల అలోవెరాను సూపర్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడంతో జ్యూస్‌ చేసుకుని తాగుతుంటారు. అయితే అలోవెరా జ్యూస్‌ను కొన్ని రకాల సమయాల్లో తాగకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఆ సందర్భాలేంటో చూద్దాం...

►గర్భం దాల్చిన మహిళలు అలోవెరా జ్యూస్‌ జోలికి పోకపోవడమే మంచిది. తల్లికాబోతున్న స్త్రీలు ఈ జ్యూస్‌ తాగడం వల్ల గర్భాశయం సంకోచానికి గురై గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి.
►దీనిలోని అంథ్రోక్వినోన్‌  వల్ల కడుపు నొప్పి, డయేరియా సంభవిస్తాయి. అందువల్ల గర్భిణులు ఈ జ్యూస్‌ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్‌ని తప్పకుండా సంప్రదించాలి.


►అలోవెరా జ్యూస్‌ శరీరంలోని పొటాషియం స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా క్రమరహిత హృదయ స్పందనలు ఏర్పడి కండరాలను బలహీనపరుస్తాయి.
►మంచిది కదా అని అతిగా అలోవెరా జ్యూస్‌ తాగితే కిడ్నీ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.


►అందువల్ల ఒక్క అలోవెరా జ్యూస్‌ అనే కాదు... ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి కదా అని ఏది పడితే అది అతిగా తాగేయడం మంచిది కాదు.  

చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement