రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే

Health Tips In Telugu: Nocturia Causes Symptoms Do Not Neglect - Sakshi

మరీ అంత తేలిగ్గా తీసుకోవద్దు 

చాలామంది రాత్రిపూట ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేస్తూనే ఉంటారు. దీనివల్ల వారికి తెల్లవార్లూ నిద్ర ఉండదు. అయితే ఇలా మూత్రం రావడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు నిపుణులు. వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది 

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడాన్ని నోక్టురియా అంటారు. అధిక రక్తపోటును ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇచ్చే మూత్రవిసర్జన మాత్ర కూడా నోక్టోరియా సమస్యకు దారితీస్తుంది. దీంతోపాటుగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి మన జీవనశైలి కూడా మరొక కారణం.

►ఇది ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది.
►కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి.
►ఆల్కహాల్‌ను ఎక్కువగా తాగినా.. కెఫీన్‌ను ఎక్కువగా తీసుకున్నా.. రాత్రిపూట మూత్రవిసర్జన ఎక్కువగా చేస్తారు.
►ఇవి శరీరంలో ఎక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీస్తాయి.
►అందువల్ల తరచు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి వైద్యునికి చూపించుకుని వారి సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకుని ఏమీ లేదని నిర్థారించుకుని నిశ్చింతగా ఉండవచ్చు. 

నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే!
చదవండి: Health Tips: పండక్కి ఫుల్లుగా తినండి కానీ... వీళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి! లేదంటే
Health Tips: బర్త్‌ ప్లాన్‌ అంటే ఏమిటి? డెలివరీ టైమ్‌లో..
Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్‌ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top