Black Salt: సాధారణ ఉప్పు బదులు.. బ్లాక్‌ సాల్ట్‌ వాడుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే...

Health Tips: Surprising Health Benefits Of Black Salt Check - Sakshi

బ్లాక్‌ సాల్ట్‌తో భలే ఉపయోగాలు

Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్‌ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు.

ఫలితంగా హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్‌ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు
►డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.
►కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
►ఎముకలు దృఢంగా మారుతాయి.
►నిద్ర చక్కగా పడుతుంది.
►మానసిక ప్రశాంతత లభిస్తుంది.

►అధిక బరువు తగ్గుతారు.
►కొవ్వు కరిగి పోతుంది.
►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.
►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
►చర్మం కాంతివంతంగా మారుతుంది.

►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్‌ సాల్ట్‌ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.  

నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది.
చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్‌.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా?

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top