breaking news
Black Salt
-
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
Health: బ్లాక్ సాల్ట్‌ను నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకుంటే..
Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ►కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ►ఎముకలు దృఢంగా మారుతాయి. ►నిద్ర చక్కగా పడుతుంది. ►మానసిక ప్రశాంతత లభిస్తుంది. ►అధిక బరువు తగ్గుతారు. ►కొవ్వు కరిగి పోతుంది. ►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ►చర్మం కాంతివంతంగా మారుతుంది. ►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా?