చినుకుల్లో చింత లేకుండా! | Health Precautions To Take During The Rainy Season | Sakshi
Sakshi News home page

చినుకుల్లో చింత లేకుండా!

Jul 4 2026 8:55 AM | Updated on Jul 4 2026 1:03 PM

Health Precautions To Take During The Rainy Season

ర్షాకాలం వచ్చేసింది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. వర్షాలు పడటం అందరికీ ఆనందాన్నిచ్చే విషయమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇదే వర్షాకాలం అనేక రోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కూడా మారుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ సీజన్‌ లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వేగంగా విజృంభిస్తాయి. అందుకే, ఈ కాలంలో మన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, చిన్నచిన్న చిట్కాలు పాటించడం ఎంతో అవసరం.

నీటితోనే ప్రమాదం ఎక్కువ..
వర్షాకాలంలో కలుషిత నీటి వల్లనే ఎక్కువ శాతం వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్‌ వంటివి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి నీటిని తాగకూడదు. ఇంట్లో కూడా కాచి చల్లార్చిన నీటిని  తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే వాటర్‌ ఫిల్టర్లను క్రమంతప్పకుండా క్లీన్‌ చేసుకోవాలి.

దోమల నివారణ..
వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి ్రపాణాంతక జ్వరాలు వస్తాయి. అందువల్ల ఇంటి పరిసరాలలో, పూల కుండీలలో, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులను ధరించడం మంచిది.

పర్సనల్‌ హైజీన్‌
వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యం. బయట నుంచి రాగానే చేతులు, కాళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే స్నానం చేసి, శరీరాన్ని ΄÷డిగా తుడుచుకోవాలి. ఎక్కువసేపు తడి బట్టలతో ఉంటే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల గోళ్లను క్రమంతప్పకుండా కత్తిరించాలి, ఎందుకంటే గోళ్ల ద్వారా బ్యాక్టీరియా ΄÷ట్టలోకి వెళ్లే అవకాశం ఉంది.

మన వెంటే!
వర్షాకాలంలో వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎప్పుడు ఆగుతుందో ఊహించడం చాలా కష్టం. అందువల్ల ఎల్లప్పుడూ గొడుగు, రెయిన్‌కోట్‌ వంటి వాటిని వెంట ఉంచుకోవాలి. మన వద్ద ఉండే మొబైల్, ల్యాప్‌ టాప్‌ వంటివి తడవకుండా ఒక మంచి ΄్లాస్టిక్‌ కవర్‌ను దగ్గర ఉంచుకోవడం మంచిది. అలాగే వర్షాకాలంలో జీన్స్‌ వంటివి ధరించడం కూడా అంత మంచిది కాదు. వర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ఆరోగ్య సమస్యకు కారణమవుతుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

నో జంక్‌ఫుడ్, నో స్ట్రీట్‌ ఫుడ్‌
ఈ సీజన్‌ లో వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. రోడ్ల పక్కన తెరిచి ఉంచే చాట్, పానీపూరి, కట్‌ చేసిన పండ్లను అస్సలు తినకూడదు. అలాగే జంక్‌ఫుడ్‌కి కూడా దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను కూడా ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలి. ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రాత్రి మిగిలిపోయిన పదార్థాలను, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినవి తినకపోవడమే బెటర్‌.

ఇమ్యూనిటీతో సేఫ్‌!
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజుకు ఒకసారైనా వేడి వేడి సూప్‌ లేదా హెర్బల్‌ టీ తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్‌–సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లను ఆహారంలో తప్పనిసరి చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement