గురవే నమః | Happy Teachers Day 2025 | Sakshi
Sakshi News home page

గురవే నమః

Sep 5 2025 9:15 AM | Updated on Sep 5 2025 9:26 AM

Happy Teachers Day 2025

 నేడు ఉపాధ్యాయ దినోత్సవం    

బాల్యం గుర్తుకు తెచ్చుకుంటే సగం జ్ఞాపకాలు వారివే. కౌమార వయసును జ్ఞప్తికి తెచ్చుకున్నా కనిపించే ముఖాలు ఆ మనుషులవే. యవ్వనపు రోజుల్ని ఎప్పుడైనా తలచుకున్నా కంటి ముందు మెదిలేవారు వారే. ఉపాధ్యా యులు కేవలం ఉద్యోగులు మాత్రమే కారు.. మన బతుకులో భా గం వారు. బడిలో ఉన్నంత కాలం ఎంత కష్టపెట్టినా.. ఆ బడి దాటి బయటకు వెళ్లాక వారిపై ఇష్టం వెయ్యింతలు పెరుగుతుంది. మాస్టారు, మేడమ్‌ అన్న పిలుపు అమ్మానాన్న అంత ఆప్యాయంగా మారిపోతుంది. అందరి విజయాల వెనుక పునాదులు వేసే ఆ శ్రామికుల రోజు ఇది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా కొందరు టీచర్ల గురించి..                     

హస్తిన వరకు మన ఖ్యాతి..  
విద్యార్థులకు జీవశాస్త్ర పాఠాలు చెప్పే బూరవెల్లి ఉమామహేశ్వరి తరగతి గదితో పా టు నిజ జీవితంలోనూ సమస్యలకు పరిష్కా రం చూపేలా విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు.  ఆమె మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘నేషనల్‌ హెయిర్‌ డై’ ప్రాజెక్ట్‌ ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి కావడం విశేషం.  ఈదుపురం ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈమె విద్యార్థి అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.

బడిని బతికించి  
ఈదుపురం కండ్ర వార్డు ప్రాథమిక పాఠశాల రోడ్డు పక్కనే ఉండటంతో తరచూ విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతుండేవారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ బడికి పంపడం మానే శారు. ఈ క్రమంలో అక్కడ హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రభాస్‌ రంజన్‌ పటా్నయక్‌ విద్యా ర్థుల తల్లిదండ్రులకు భరోసా కలి్పంచారు. ఉద యం ఎనిమిది గంటలకే బడికి చేరుకొని చేతిలో ఎర్రజెండాను పట్టుకొని రోడ్డెక్కి విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో వాహనాలకు రెడ్‌ సిగ్నల్‌ ఇవ్వడం, మళ్లీ సాయంత్రం బడి విడిచి పెట్టే సమయంలో ఎర్ర జెండాతో రోడ్డెక్కి విద్యార్థులు రోడ్డు దాటే వరకు వాహనాలను ఆపుతారు.

క్యూ ఆర్‌ కోడ్‌ రూపకల్పన  
ఇచ్ఛాపురం మండలం కీర్తిపురం ఒడియా ఆద ర్శ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చంద్రశేఖరం రానా ‘దీక్ష ఈ– కంటెంట్‌’ ద్వారా మైనార్టీ మీడియా పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలకు సంబంధించి చిత్రాలు, కథలు, ఇతరత్రా భా షాంశాలను ‘క్యూఆర్‌ కోడ్‌’లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంగ్లి‹Ù, గణితం, సై న్స్, సోషల్‌ వంటి సబ్జెక్టులను బోధిస్తుంటారు.  

జీతానికి న్యాయం  
నరసన్నపేట: అవార్డుల కోసం కాదు.. నేను తీసుకుంటున్న జీతానికి.. నా ఉపాధ్యాయ వృత్తికి న్యా యం చేస్తున్నా అని అంటుంటారు నక్క అప్ప య్య మాస్టారు. 2023లో బసివలస స్కూల్‌కు ఆయన బదిలీపై వచ్చారు. ఆయన వచ్చే నాటికి ఇక్కడ పిల్లల సంఖ్య 19. ఇప్పుడు 29.  అందరూ ఆంగ్లంలో మాట్లాడతారు.  ‘ద నెక్స్‌జెన్స్‌’ అని ఒక యూట్యూబ్‌ చానల్‌ స్కూల్‌ పేరున పెట్టారు. ఇందులో విద్యార్థుల కృత్యాలు ఉంటాయి. స్కూల్‌ పేరున ఒక వెబ్‌సైట్‌ కూడా రూపొందించి పిల్లల సమగ్ర సమాచారం పెడుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement