'ఆరెంజ్‌ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్‌! వీడియో వైరల్‌

Gandhis Share Their Homemade Orange Marmalade Recipe - Sakshi

ఈ రోజుతో 2023 ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఆదివారాన్ని ఆరెంజ్‌ మార్మలాడే(ప్రిజర్వ్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌) అనే రెసీపీ ప్రీపరేషన్‌తో గడిపారు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్‌. ఈ వంటకం రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర లోగోతో కూడిన తన యూట్యూబ్‌ ఛానెల్‌ పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోలో.. సోనియా, రాహుల్‌ ఇద్దరు కలిసి కిచెన్‌ గార్డెన్‌లోకి వెళ్లి పండ్లను తెచ్చి ఒక బుట్టలో వేసుకుని వస్తారు. ఈ రెసిపీ కోసం పూర్తిగా పండినవే కోయాలని సోనియా చెప్పగా, రాహుల్‌ నవ్వుతూ.. అవే ఎందుకు కోయాలంటూ చిలిపిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరు వంటగదిలోకి వచ్చి వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్‌ తీశారు. ఆ జ్యూస్‌ని, చక్కెరని అల్యూమినియం పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించారు.

రాహుల్‌ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్‌ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా! అని సరదాగా అన్నారు రాహుల్‌. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్‌ వేశారు. మంచిది అప్పుడు ఆ జామ్‌ మొత్తం మనకే సొంతం అని రాహుల్‌ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ దశాబ్దాల క్రితం భారతీయ వంటకాలకు తాను అలవాటు పడటానికి ఎల ఆ కష్టపడ్డానో వివరించారు.

ముఖ్యంగా భారతీయ రుచుల్లో మిరపకాయలకు అడ్జెట్‌ అవ్వడానికి చాలా టైం పట్టిందని సోనియా చెప్పుకొచ్చారు. ఇక ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్‌ చేసి పైన ఒక లవ్‌ సింబల్‌ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్‌ అని రాశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: రోబొటిక్‌ పెట్‌ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి! పెంపు జంతువులకు ప్రత్యామ్నాయంగా..)

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top