జిడ్డు చర్మ సమస్యను అధిగమించాలంటే..

Foods That Oily Skin People Should Avoid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మానవ జాతికి అందమనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అందాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అనేక క్రీమ్‌లు, లోషన్‌లు వాడుతుంటారు. ప్రస్తుత పోటీ యుగంలో విపరీతమైన ఒత్తిడి, శరీర తత్వానికి కావాల్సిన ఆహారం తినకపోవడం తదితర కారణాలతో ప్రజలు జిడ్డు చర్మ సమస‍్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిడ్డు సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని పదార్థాలను తినకూడదని అపోలో టెలిహెల్త్‌ సీనియర్‌ డర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ రాధా గంగాతి సూచిస్తున్నారు. డాక్టర్‌ సూచిస్తున్న తినకూడని ఆహారాలు ఏవో చూద్దాం.

డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం:
జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని డాక్టర్‌ సూచిస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ కేలరీలతో లభించే సోయా పాలను తాగవచ్చని తెలిపింది. మరోవైపు జిడ్డు చర్మ సమస్యను జయించాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడం మేలని డాక్టర్‌ సూచిస్తున్నారు

చాక్‌లెట్స్‌కు దూరంగా ఉండడం
చాక్లెట్స్‌ తినడం ద్వారా జిడ్డు సమస్య వేదిస్తుంది. చాక్లెట్‌లో ఉండే చక్కెర శాతం చర్మం జిడ్డుగా మారడానికి ప్రేరేపిస్తుంది. అయితే చాక్లెట్‌ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్‌.. 15రోజులకు ఒకసారి డార్క్‌ చాక్లెట్‌ తిన్నట్లయితే అంత ఇబ్బంది ఉండదని డాక్టర్‌ సూచించింది

జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడం
ప్రస్తుత ప్రపంచంలో జంక్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. కానీ జిడ్డు చర్మ సమస్యను నివారించాలనుకునేవారు జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని, డయిరీ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నూనె గ్రంథుల పరిణామం పెరిగి జిడ్డు, మొటిమల సమస్య తలెత్తుతుంది

మాంసాహారానికి దూరంగా ఉండడం
మీరు మాంసాహార ప్రియులా, అయితే నిత్యం మాంసాహారం భుజించడం వల్ల శరీరంలో చెడు కొవ్వు శాతం అధికమయి జిడ్డు సమస్య  తెలెత్తుతుంది. కాగా ఆహార నియమాల అనేవి శరీర తత్వానికి అనుగుణంగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్‌ గంగాతి పేర్కొన్నారు
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top