మంచి నిద్రతో గుండెపోటు దూరం

Five Ways To Sleep Well And Protect Your Heart - Sakshi

నిద్రకూ గుండెపోటు నివారణకూ సంబంధం ఉంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల తో గుండెపోటును ఇలా నివారించుకోవచ్చు.
►మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. 
►మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. 
►తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు.
►నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే  కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది. 
►నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top