
చాలా మందికి పొద్దున్నే లేవగానే వేడి వేడి టీ కడుపులో పడనిదే బండి నడవనని మొరాయిస్తుంది. అంతెందుకు, సంతోషంలోనూ, దుఃఖంలోనూ, ఉల్లాసంలోనూ, ఉత్సాహంలోనూ, ఆందోళనలోనూ, ఆనందలోనూ కూడా గరమ్ గరమ్ చాయ్ పడనిదే పొద్దు΄ోదు. ఆవేశం వచ్చినా, ఆగ్రహం వచ్చినా దానిని చల్లార్చేది టీనే. కొందరయితే భోజనం చేయగానే టీ తాగుతారు. అయితే అది అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు వంటికి పట్టవట. అంతేకాదు, టీలో ఉండే టానిన్లు, పాలీఫేనోల్స్ రక్తంలో ఐరన్ కలవకుండా అడ్డుకుంటాయట. అంతేకాదు, జీర్ణరసాలు ఊరకుండా కూడా చేస్తాయట. అందుకే అన్నం తిన్న వెంటనే కాకుండా కనీసం గంటా గంటన్నర వరకు ఆగి అప్పుడు టీ తాగడం కొంతమేరకు నయం అని ΄ోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి విటమిన్ సి
ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలా ఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని తాగేయొచ్చు.