పెట్రోల్‌ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!

Desi Jugad 6 People travelling Together On A Bike Watch This Viral Video - Sakshi

ఒక బైకుపై ఆరుగురు వ్యక్తులు ఒకరిని ఒకరు అంటకుండా వెళ్లడం సాధ్యమా? ఫజిల్‌లా ఉందే.. ఇదేలా సాధ్యమౌతుంది.. ఇదేనా మీ సమాధానం. ఐతే ఈ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి.

బైకుకు వెనక భాగంలో ఒక నెచ్చెన కట్టి, దానికి రెండు టైర్లు అమర్చారు. బైకు నడిపే వ్యక్తి కాకుండా ఇంకా ఐదుగురు, వారి లగేజీలతోసహా ఆ నిచ్చెనపై హాయిగా కూర్చున్నారు. ఇంతమంది కూర్చోగా ఇంకా కావల్సినంత స్థలం మిగిలి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డుపై వేరే వెహికల్‌లో ప్రయాణించే వారు ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌ అయ్యింది. ఒకే పనిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు చెయ్యాలి.. ఇలా కూడా చేయొచ్చని వీళ్లు నిరూపించారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. పెరిగిన పెట్రోల్‌ రేట్ల దృష్ట్యా ఐడియా అదుర్స్‌ అని సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఐడియా భలే ఉందిగానీ, సేఫ్టి చూసుకోండి గురూ అని మరికొందరు సూచిస్తున్నారు. పాపం ట్రాఫిక్‌ పోలీసుల కంటబడితే వీళ్ల పరిస్థితి ఏంటో అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఈ వాటర్‌ బాటిల్‌ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top