ఈ వాటర్‌ బాటిల్‌ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..

This 750 ML Water Bottle Is Worlds Most Costliest Water Know This Details - Sakshi

ఈ వాటర్‌ బాటిల్‌ ధర అనేక కంపెనీల్లో పనిచేసే సీఈఓల జీతాల కంటే ఎక్కువే.. ఇన్నాళ్లూ ఖర్చులేకుండా దొరికేవి నీరు, గాలి అని అనుకున్నాం. వీటిని ఫ్రీగానే మనం వాడుకొంటాం కాబట్టి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో నీళ్లను బాటిల్ల రూపంలో కొంటాం. ధర కూడా రూ. 50ల లోపు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? లీటర్‌ కూడా ఉండని ఈ బాటిల్‌ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!

ఐతే షాంపెన్‌ లాంటి వైన్స్‌, సింగిల్‌ మాల్ట్‌ విస్కీల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేయడంలో ఆశ్యర్యపడవల్సిన అవసరం లేదు. కానీ రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్‌ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.

చదవండి: ఆ పెట్రోల్‌ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్‌ ఫ్రీ.. కారణం ఇదేనట!! 

అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్‌ బాటిల్‌ గురించే మనం చర్చిస్తుంది. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్‌ బాటిల్‌ ధర అక్షరాల 45 లక్షల రూపాయలు! బాప్‌రే.. అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి. లీటర్‌ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్‌? అంటే..

ఈ నీళ్లను ఫ్రాన్స్‌, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్‌లో అనేక మినరల్‌ వాటర్‌ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ  ఈ వాటర్‌ బాటిల్‌ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్‌ బాటిల్‌ డిజైన్‌ కూడా ఒక కారణమే. ఎందుకంటే.. 

చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!

►ఈ బాటిల్‌ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం.
►ఈ బాటిల్‌ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్‌ డిజైనర్‌ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్‌ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్‌ డ్యుడోగ్నన్‌ కోగ్‌న్యాక్‌ అనే వైన్‌ బాటిల్‌ కూడా ఇతనే డిజైన్‌ చేశాడు.
►ఈ బాటిల్‌లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట.

అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. !

చదవండి: జంక్‌ఫుడ్‌ తింటున్నారా? అల్జీమర్స్‌, డిప్రెషన్‌.. ఇంకా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top