స్టన్నింగ్‌ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్‌ నిహారిక! | Deepika Tanwar Branded Dress Worn By Niharika Konidela, Know Her Outfit And Jewellery Details - Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్‌ నిహారిక! డ్రెస్‌ ధర ఎంతంటే..

Mar 3 2024 4:29 PM | Updated on Mar 3 2024 6:43 PM

Deepika Tanwar Branded Dress Worn By Niharika Konidela - Sakshi

నిహారిక కొణిదెల..  యాంకర్‌గా, నటిగా, నిర్మాతగానే కాదు ట్రెండీ లుక్స్‌తో ఫ్యాషన్‌ ఐకాన్‌ గానూ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఆమెకు స్ట్రీట్‌ షాపింగే ఇష్టమట. సెలబ్రిటీలు అందరూ  బ్రాండెడ్‌ దుస్తులే ధరిస్తారు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం స్ట్రీట్‌ షాపింగే ఇష్టం. నచ్చిన వాటిని వెదికి వెదికి వెలికి తీస్తాను అంటోంది. ఇక ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ను క్యారీ చేస్తున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ..  

డ్రెస్‌ బ్రాండ్‌:తన్వా బై దీపిక 
హైదరాబాద్‌ ఎన్‌ఐఎఫ్‌టీలో డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసిన దీపిక ఆనంద్‌.. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. ఈ మధ్యనే హైదరాబాద్‌లోనే ‘తన్వా బై దీపిక’ పేరుతో సొంత ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించింది. ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్‌ చేస్తూ, అనతికాలంలోనే టాలీవుడ్‌ సెలబ్రిటీలకు హాట్‌ ఫేవరెట్‌గా మారింది. ధరలు.. సామాన్యుడికీ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ నిహారిక ధరించిన తన్వా బై దీపిక డిజైనర్‌ డ్రస్‌ ధర రూ. 21,000/-

జ్యూలరీ బ్రాండ్‌: రియా జ్యూయెల్స్‌
వెరైటీ డిజైన్స్‌కు క్రేజీ కేరాఫ్‌ ఈ బ్రాండ్‌.  అన్ని రకాల బంగారు, వెండి పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్‌ వంటి ఇతర డిజైనర్‌ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది.
ఉంగరం ధర: రూ.750/-, కమ్మలు ధర: రూ.4,200/-

(చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!)

Advertisement
 
Advertisement
Advertisement