దేవి నవరాత్రుల సందడి మొదలైంది. యావత్తు భారతదేశం ఈ సమయంలో భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంది. ఎటు చూసినా.. పండుగ శోభతో మనోహరంగా ఉంటుంది. అందులోనూ ఈ దుర్గా పూజ కోల్‌కతాలో మరింత ప్రత్యేకం. అక్కడ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలోనే భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ వేడుకలను ప్రత్యేకంగా వీక్షించేందుకు కోల్‌కతాలో పర్యటించారు. అంతేగాదు ఈ పండుగపై తన అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఇలా పంచుకున్నారు. కోల్‌కతాకు తిరిగి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా నగరంలో కొన్ని అందమైన దుర్గా పూజ పండాల్‌లను సందర్శించి, ఈ వేడుకతో ముడిపడి ఉన్న సృజనాత్మకతను, సాముహిక స్ఫూర్తిని అనుభవించానని అన్నారు.

ఈ పర్యటనలో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందానన్నారు. అంతేగాదు ఈ దుర్గాపూజ ప్రతి ఒక్కరికి ఎందుకింతో ప్రత్యేకమో అనుభవపూర్వకంగా అర్థమైందన్నారు. అలాగే అందరికీ దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలో అమ్మవారి విగ్రహాలను తయారు చేయు విధానం, ఆ పూజలో దాగున్న సమాజ స్ఫూర్తి ఈ పండుగను మరింత ప్రత్యేకం చేశాయని నొక్కి చెప్పారు. అందుకే ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ దుర్గా పూజ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు అమెరికా రాయబారి సెర్గియో.
Great to be back in Kolkata! Visited some beautiful pandals and experienced firsthand the incredible creativity, community spirit, and warmth. I can see why this celebration is so special. Happy Durga Puja to everyone celebrating! https://t.co/PsX4imUqhD
— Ambassador Sergio Gor (@USAmbIndia) October 12, 2026
ఇదీ చదవండి: నటి యామీ గౌతమ్ ధరించిన కుర్తాసెట్.. అన్ని లక్షలా..!


